Home  »  Bollywood News  »  పెళ్లి రోజు గిఫ్ట్ అంటు విడాకుల నోటీసు.. స్టార్ హీరోయిన్ ఎమోషనల్ 

Updated : Jul 6, 2026

 

మంచు విష్ణు సరసన 'సూర్యం'తో జత కట్టి తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన భామ  సెలీనా జైట్లీ(celina jaitly).. మాజీ మిస్ ఇండియా కూడా అయిన సెలీనా బాలీవుడ్ లో అనేక హిట్ చిత్రాల్లో చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చింది.  కెరీర్ పీక్ లో  ఉన్నప్పుడే 2010లో ఆస్ట్రియన్ వ్యాపారవేత్త పీటర్ హాగ్‌ని వివాహం చేసుకుని విదేశాల్లో స్థిరపడ్డారు. వివాహం తర్వాత సినిమాలకి దూరమై  పూర్తిగా కుటుంబానికే అంకితమయ్యారు. అయితే, దాదాపు 15 ఏళ్ల తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న తరుణంలో తాజాగా తన వైవాహక జీవితంలో అనుభవించిన నరకాన్ని బయటపెట్టి అందరినీ షాక్‌కి గురిచేశారు. 


తమ 15వ వివాహ వార్షికోత్సవం (వెడ్డింగ్ యానివర్సరీ) రోజున జరిగిన ఒక దారుణమైన సంఘటనను గుర్తుచేసుకుంటూ సెలీనా ఎమోషనల్ అయ్యారు.సోషల్ మీడియా వేదికగా ఆమె స్పందిస్తూ ' నా భర్త  కారులో తీసుకెళ్లి, ఒక కొండ కింద నిర్జనమైన రోడ్డుపై ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి తీవ్ర ఆందోళనతో నడుచుకుంటూ ఇంటికి చేరుకున్నాక, ఆస్ట్రియా పోస్ట్ ఆఫీస్ నుండి వచ్చిన ఒక లేఖ కనిపించింది. ఆ లేఖ జర్మన్ భాషలో ఉండటంతో నా  పిల్లలైన విన్‌స్టన్, విరాజ్‌లకు దానిని చదవమని ఇచ్చాను. వాళ్ళు ఆ లేఖ చదవగానే  నా ప్రపంచం ఒక్కసారిగా కూలిపోయింది. ఎందుకంటే, అది పెళ్లి రోజు కానుక (యానివర్సరీ గిఫ్ట్) పేరిట నా భర్త నాకు పంపిన విడాకుల నోటీసు. నా  కన్నబిడ్డల నోటే, నాపై  భర్త చేసిన దారుణమైన ఆరోపణలను వినాల్సి రావడం జీవితాంతం మర్చిపోలేని పెద్ద గాయంగా మిగిలిపోయింది.

కోర్టు మొదటి విచారణలోనే ఇద్దరూ సామరస్యంగా విడిపోవాలని సూచించినప్పటికీ, అప్పటికే నేను  తీవ్రమైన ఆర్థిక, మానసిక ఒలిడికి గురయ్యాను. ఆ సమయంలో నా అకౌంట్ లో డబ్బులు లేవు. అయినప్పటికీ పిల్లల భవిష్యత్తు కోసం భర్త ఆస్తిలో తనకు పైసా కూడా వద్దని కోర్టుకి చెప్పాను. పెళ్లికి ముందు  కష్టపడి సంపాదించిన సొంత ఆస్తులని మాత్రమే తిరిగి ఇవ్వాలని అడగడంతో పాటు  పిల్లల సంరక్షణ బాధ్యత (జాయింట్ కస్టడీ) కావాలని అడిగాను . కానీ ఆ తర్వాత పరిస్థితులు మరింత నరకంగా మారాయి. దాంతో నా ఇంట్లోనే బందీగా ఉండాల్సి వచ్చింది. అంతేకాకుండా, ఉద్యోగం చేయాలని ఒత్తిడి తెస్తూ, సూపర్ మార్కెట్‌లో క్లీనర్ ఉద్యోగం ఇప్పిస్తానంటూ నా భర్త  తీవ్రంగా అవమానించాడు. ఇండియాలో 2004లో nenu కొనుగోలు చేసిన సొంత ఆస్తులని  కూడా విక్రయించేందుకు  ప్రయత్నించడంతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను .

చివరకి ప్రాణాలను దక్కించుకోవాలనే భయంతో 2025 నవంబర్‌లో అర్ధరాత్రి వేళ పిల్లలతో కలిసి స్వదేశానికి తిరిగి వచ్చేసి ముంబై కోర్టులో గృహ హింస కేసు దాఖలు చేశారు. తన భర్త పీటర్ హాగ్‌పై గృహహింస, క్రూరత్వం, మోసపూరిత చర్యల కింద కేసు నమోదు చేసి నెలకి 10 లక్షల భరణంతో పాటు50 కోట్ల  పరిహారాన్ని డిమాండ్ చేశాను . ప్రస్తుతం ఆస్ట్రియా ఫ్యామిలీ కోర్టు జాయింట్ కస్టడీ ఇచ్చినప్పటికీ, పిల్లలని  ఒక రహస్య ప్రాంతానికి తరలించి వాళ్లకి బ్రెయిన్ వాష్ చేసి నాతో మాట్లాడకుండా అడ్డుకుంటున్నాడ ని చెప్పుకొచ్చింది. సెలీనా మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సెలీనాకి మొత్తం ముగ్గరు మగపిల్లలు. పేర్లు  విన్‌స్టన్, విరాజ్, ఆర్థర్.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.